పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఒంటి నిట్టాడు గుడిసె

చిత్రం
ఒంటి నిట్టాడు గుడిసె ................................................✨ ఇగో ఇక్కన్నె వాన జల్లుకు వణుకుతూ రెక్కల సంటి పిల్లల్ని ఒదిగిన  తల్లి కోడోలె చూరు నీళ్లు రాలుస్తూ  మా ఒంటి నిట్టాడు గుడిసె ఉండేది ఒళ్ళంతా నల్ల మట్టి రాసుకుని  తెల్లని గీతల గంధం పూసుకుని పీర్ల పండుగ షర్బత్ పటవ చిమ్మటించినట్టు  ఎప్పుడు చెరువు అలుగువడ్డా  బురద నీరు మా గుడిసెలకు రాగానే తేటగా పారేది వానెలిసే దాక కాలు కింద పెట్టనియ్యక నులక మంచం చూరు సుక్కల తాళమేస్తూ నిద్ర పుచ్చేది ఈ తూర్పు మూలకు ఎర్రమన్నలికిన మూడు రాళ్ళ పొయ్యి ఉండేది ముదునష్టపు వాన ఎప్పుడు పోతదో అని  దాది పచ్చి కట్టెలు పొయిల వెడుతుంటే  వాన మిత్రుని వెనకేసుకొస్తున్నట్టు  చిట పటమని అగ్గి రాజేసుకునేది ఎసరు వంపిన గంజి నీళ్ళే కడుపు నిండెది  అన్నం వద్దే వద్దు అనేటోల్లం దాని కుడిబాజు వాసానికి జనపనార ఉట్టి బువ్వ పెళ్ళ నెత్తి నేసుకుని చూసేది మాపటికి సుట్టం ఎవలన్న వస్తరెమో అని అక్క పుట్టినప్పుడే వానలకు మట్టి గోడ మెత్తబడి బయటి బాజుకు కూలింది ఆడపిల్ల మీద అల్లా వెలుగు దీవెనలిస్తున్నట్టు ఆయాల్ల గోడ మీదపడ్డా ఈ కట్టం తప్పేదిరా అని అమ్మి గోడేళ్ల పొస్తది మతిలపడ్డప్పుడల్ల ఇం