పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

వయసు సోగసుల నిధి...!

చిత్రం
చెలి నా నిచ్చెలి........... అపురూపాల పదకోమలి  చిగురించె పసిరెమ్మవి  కురిసె వర దీప్తివి  తడిసె జడి ముక్తివి  అర విరిసిన ఓ జాబిలి  విర కాసిన తారల వెలుగువి  చెంగంచున చిలకల ముగ్గువి  కొంగు దాపులో పూల రెమ్మవి  వయసు సోగసుల నిధి నీవె  నీ సోగసు పిలుపులు నను చేరె  సుందరమంటి నీ మోము  వలపు బాణాలు ఇటు విసిరె  నాటు చూపులు గాటు మాటలు  పోటు వేసెటి నీటు మమతలు  నన్ను పిలిచెను పరద మాటుకు  మెల్లగ జారె వస్త్రాలు మత్తున జారె నేత్రాలు  హ...ఈ రాతిరి నాదే రక్తిలో జోరె  గెలుపోటములకు తావే లెక  ఈ తిమిరం ఊగుతు సాగవలె  మదు కౌగిట చెమటల జారవలె  మన కలయిక మనసుకు మంజిరమై  సంత్రుప్తి గీతాలు పాడవలె.. ---------------------------------------++++🪄 రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

వైద్యులు.. ఆరాద్యులు...!

చిత్రం
శ్రీ నమష్క్రుత సలాము మీకు స్వియ పరిపాలకా దయించు మాకు పూజ్యనీయ శుభమస్తు మీకు ఆరోగ్యమస్తు అని దీవించు మాకు వాణిజ్యమై, వ్యాపారమై దౌర్భాగ్యం చేరి, ధనార్జన కోరి ప్రామాణికం మారి, ప్రాధాన్యత జారి పల్లేరు దారి మార్చ పయనమైనారు పైస శ్వాస కాదని శాశించినారు ఆస్తి పరులని, అన్నార్తులని లేక బేద బావము రాక, భావి బంధం లేక ధీనుల రాతలు, కలిగించు రోతలు దర్శిస్తె మీకు తోలగు మా వెతలు అందరూ బ్రతకాలని మీ వైద్యం అందరికి అందాలని ఆరాట పడినారు, ఆ దిశలో నడిచారు జన్మించితివి మనిషిగా వెలుగొందుతువు మహార్షిలా మీ చేతిలో సంజీవిని దాగివుందో మా గొంతులో అమ్రుతమే జారుతుందో నవ నాడులు ఉత్తేజమై అంతా మాయ..! మా దెహం లో నిండును ఆరొగ్యచాయ ఈ కరోనా పై పొరాటం లో ఆటంకాలు అనుభవ పాటాలు కావాలి దాన్ని నివారించి నిఘంటువుగా మీ పేరు చిరస్తాయిలో నిలవాలి అనుభవజ్ఞులందరూ మీ మేథలో కోలువుండి మీరు సాగించు యజ్ణానికి చమురుగా తోడుండి యాగఫలం ఆరోగ్య సూత్రాలై వెలుగునండి మహమ్మారి కరోనాను ఖతం పెట్టెయ్యండి వైద్యొనారయణే హరి వైద్యుడు దైవం తో సమానం అన్నారు అక్షరాల మీకది చెందాలని నలుగురు అనగా విన్నాను నూరు వసంతాలు జీవించు దైవమా మీరేగు దారులన్ని విజయాలు పరువగా...