వయసు సోగసుల నిధి...!













చెలి నా నిచ్చెలి...........
అపురూపాల పదకోమలి 
చిగురించె పసిరెమ్మవి 
కురిసె వర దీప్తివి 
తడిసె జడి ముక్తివి 

అర విరిసిన ఓ జాబిలి 
విర కాసిన తారల వెలుగువి 
చెంగంచున చిలకల ముగ్గువి 
కొంగు దాపులో పూల రెమ్మవి 

వయసు సోగసుల నిధి నీవె 
నీ సోగసు పిలుపులు నను చేరె 
సుందరమంటి నీ మోము 
వలపు బాణాలు ఇటు విసిరె 

నాటు చూపులు గాటు మాటలు 
పోటు వేసెటి నీటు మమతలు 
నన్ను పిలిచెను పరద మాటుకు 
మెల్లగ జారె వస్త్రాలు మత్తున జారె నేత్రాలు 

హ...ఈ రాతిరి నాదే రక్తిలో జోరె 
గెలుపోటములకు తావే లెక 
ఈ తిమిరం ఊగుతు సాగవలె 
మదు కౌగిట చెమటల జారవలె 
మన కలయిక మనసుకు మంజిరమై 
సంత్రుప్తి గీతాలు పాడవలె..
---------------------------------------++++🪄
రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...