వైద్యులు.. ఆరాద్యులు...!











శ్రీ నమష్క్రుత సలాము మీకు
స్వియ పరిపాలకా దయించు మాకు
పూజ్యనీయ శుభమస్తు మీకు
ఆరోగ్యమస్తు అని దీవించు మాకు

వాణిజ్యమై, వ్యాపారమై
దౌర్భాగ్యం చేరి, ధనార్జన కోరి
ప్రామాణికం మారి, ప్రాధాన్యత జారి
పల్లేరు దారి మార్చ పయనమైనారు
పైస శ్వాస కాదని శాశించినారు

ఆస్తి పరులని, అన్నార్తులని లేక
బేద బావము రాక, భావి బంధం లేక
ధీనుల రాతలు, కలిగించు రోతలు
దర్శిస్తె మీకు తోలగు మా వెతలు

అందరూ బ్రతకాలని
మీ వైద్యం అందరికి అందాలని
ఆరాట పడినారు, ఆ దిశలో నడిచారు
జన్మించితివి మనిషిగా వెలుగొందుతువు మహార్షిలా

మీ చేతిలో సంజీవిని దాగివుందో
మా గొంతులో అమ్రుతమే జారుతుందో
నవ నాడులు ఉత్తేజమై అంతా మాయ..!
మా దెహం లో నిండును ఆరొగ్యచాయ

ఈ కరోనా పై పొరాటం లో
ఆటంకాలు అనుభవ పాటాలు కావాలి
దాన్ని నివారించి నిఘంటువుగా
మీ పేరు చిరస్తాయిలో నిలవాలి

అనుభవజ్ఞులందరూ మీ మేథలో కోలువుండి
మీరు సాగించు యజ్ణానికి చమురుగా తోడుండి
యాగఫలం ఆరోగ్య సూత్రాలై వెలుగునండి
మహమ్మారి కరోనాను ఖతం పెట్టెయ్యండి

వైద్యొనారయణే హరి
వైద్యుడు దైవం తో సమానం అన్నారు
అక్షరాల మీకది చెందాలని నలుగురు అనగా విన్నాను
నూరు వసంతాలు జీవించు దైవమా
మీరేగు దారులన్ని విజయాలు పరువగా...

 రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

  1. ఆద్యాత్మిక ధుని
    విజ్ణాన ఖని నా బారతదేశం

    తప్పకుండా కరోనాని అంతం చెస్తాం

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...