సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...

 


సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...

(మా ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పుట్టిన రోజు సందర్భంగా)


అమ్మా అన్నార్తుల పక్షానివై

చితికిన బతుకుల్లో నేస్తానివై

గిరి పుత్రుల ఇంటి ఇలవేల్పువై

పీడిత జన సమూహమై


పోరాటమే శరణమని పిడికిలెత్తి కదిలావు

బందూకు చేతపట్టి రుద్రమనని చాటావు

దొరలగడిల నెదిరించి, భూస్వాముల గుండె చీల్చి

అంటరాని బ్రతుకులో అమ్మ నీవు అయ్యావు

బాధర బందీలు బాపి భానుడల్లే తోచావు


ఇలా నీ సగం జీవితం అడవిలోను 

అజ్ఞాతంలోను గడిచిపోయింది కదమ్మా

ఇప్పుడు అధికారం చేతిలోవున్నా

ఈ అరణ్యవాసం ఏమిటమ్మా


కరోనాతో ప్రపంచమే నడింట్లో నక్కి దాక్కుంటే

గిరి పుత్రులు కొండ కోయలపై ఇంత ప్రేమ ఎందుకమ్మా

సుగుణములేవైనా జన్మతః రావాలంటే విన్నాను

మిమ్ము కళ్ళతో చూసాకే నిజం అని నమ్మాను


ఎండ్ల బండి, ట్రాక్టరే మీకు పుష్పక విమానమై కదిలావు

అడవి బిడ్డల ఆకలి తీర్చి అక్షయ ప్రదాయిని అయ్యావు

కామ్రేడ్ అని నినదించినా, అధ్యక్షా అని గర్జించినా

బహు బాగుంది తల్లి మకిలి పట్టిన వ్యవస్థపై నీ వేట

మా నాడిలో రక్తం వలె నడుస్తాము తల్లి మీ బాట


ఋణగ్రస్తులం అయ్యాము తల్లి

మీ తెగువకు అబ్బురపడి మీ త్యాగానికి ఆశ్చర్యపడి

అమ్మా మీ పాదాలకు మా కన్నీటి తర్పణం

అన్ని వేళలా మీ నామమే మాకు స్పురణం..

 

రచన : తాజ్ 

పల్లెటూరి పిల్లోడు




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె