పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

బిగిసిన తనువుల గాథ...!

చిత్రం
  బిగిసిన తనువుల గాథ...! సంధ్య జరిగి చీకటి దూరి, వెన్నెలే ఇంట పరుపు వేయగా చల చల్లని ఈ గాలిలో, నిదుర మరచిన రేయిలో మదిని తొలుచు భాద ఏదో, అడగమంది మాట నీతో ఆశ ఒకటి కనుల కదిలే, నీ రంగు బుగ్గ కొరక తగిలే నీ నడుము మడతపై, నా ఇరుచేతులు రంకెలేసే పెదవి వదిలి నిలవను అంటూ, నీ లేత కాపు కొరకాలంటూ నా పంటి కాటు మంటలు రేపి, నీ పరువాలను గోటితో గిచ్చే పడుచు కోర్కె నిద్దుర లేసి, తనువులు బిగిసే కౌగిలి లతలా నీ పూవును దగ్గర చూసి, నా పురుగును కసిగా ఉసి గొలిపి నడిజాము దాటే వరకు, రక్తమంత చెమటను చేసి నీ ఒంటిపైన పూతగ పూసి, నీ గుండెలపై భారం వేసి అమ్మ నాన్న ఆట ఆడుదాం, స్వర్గ సీమ అంచు చేరుదాం.. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సంక్రాంతి శుభాకాంక్షలతో.......!

చిత్రం
  సంక్రాంతి శుభాకాంక్షలతో.......! భోగి సంద్యన భోగాలు కాచి వైభోగాలు తీసి సంక్రాంతి పొద్దు వెన్నెల వర్ణాలు గీసి వరములను దోసి కనుమ కింపుగ గంగి రెద్దులను బడసి గమ్మత్తు చూసి సర్వదేవతలను ధ్యానంగ తలచి మదిలోన నిలిసి గరిభింట ఆకలోకింత చూసి దానాలు చేసి ఆత్మీయులనెల్ల ఆలింగనము చేసి శుభాకాంక్షల బహుమతులు తెలిపి కష్టాలు మాసి అష్టైశ్వర్యాలు దోసి హాయిగా ఆహ్లాదంగా పండుగ సాగాలని కోరుకుంటూ...! మీ తాజ్ పల్లెటూరి పిల్లోడు సాహితీ లోకానికి, ఆత్మీయులకు, మిత్రులకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు..................🙏

మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి...!

చిత్రం
  మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి...! కుంచేపట్టి నీ రూపు గిసే యుక్తి లేకున్నా ఉలితో శిలను శిల్పంగా మలిచే నేర్పు లేకున్నా హలం పట్టి మట్టి తెచ్చి నీ బొమ్మ చేయ శక్తి లేకున్నా గళం విప్పి నీ కీర్తి నలు దిశలా గానం చేయు ఓర్పు లేకున్నా కన్నులనే కలం చేసి ఊహాలనే ఇంకుపోసి నా మనసు కాగితం పైనే ముత్యాల తీనే గిసి వర్ణించగలనమ్మా నీ తీరు తీగ చాచిన మల్లెలమ్మ తీయని నా కోర్కె తీర్చు తీపి రసాల మామిళ్ళ కొమ్మ గుడిలో ఉంటేనే దేవత అంటారని నా గుండె నే గుడిగా చేసి కొలువైన దేవత సుప్రభాత వేళ కాగా నా గుండె లయతో నిద్రలేచి నా కోర్కెలు మన్నించునే, వరాలిడి దివించులే అబ్బా నీ ముఖ సిరి, చూడ గానే రాలు నిధి హా హా హా నీ వయ్యారం, తాకగానే జారు మడి అనురాగపు మమతల నిడి, అమృతాల కమ్మని ఒడి మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి సాగే నీ నడక వడి వడి, నా తనువు తివాచీ చేస్తా నేలపై పడి...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు