మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి...!

 








మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి...!

కుంచేపట్టి నీ రూపు గిసే యుక్తి లేకున్నా
ఉలితో శిలను శిల్పంగా మలిచే నేర్పు లేకున్నా
హలం పట్టి మట్టి తెచ్చి నీ బొమ్మ చేయ శక్తి లేకున్నా
గళం విప్పి నీ కీర్తి నలు దిశలా గానం చేయు ఓర్పు లేకున్నా

కన్నులనే కలం చేసి ఊహాలనే ఇంకుపోసి
నా మనసు కాగితం పైనే ముత్యాల తీనే గిసి
వర్ణించగలనమ్మా నీ తీరు తీగ చాచిన మల్లెలమ్మ
తీయని నా కోర్కె తీర్చు తీపి రసాల మామిళ్ళ కొమ్మ

గుడిలో ఉంటేనే దేవత అంటారని
నా గుండె నే గుడిగా చేసి కొలువైన దేవత
సుప్రభాత వేళ కాగా నా గుండె లయతో నిద్రలేచి
నా కోర్కెలు మన్నించునే, వరాలిడి దివించులే

అబ్బా నీ ముఖ సిరి, చూడ గానే రాలు నిధి
హా హా హా నీ వయ్యారం, తాకగానే జారు మడి
అనురాగపు మమతల నిడి, అమృతాల కమ్మని ఒడి
మ్రొక్కనా నీ పాదం తడి, మురవదా నా నెత్తిన సుడి
సాగే నీ నడక వడి వడి, నా తనువు తివాచీ చేస్తా నేలపై పడి...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...