పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రేమ లేఖ...!

చిత్రం
  ప్రేమ లేఖ...! ఓ మాట నా నోట ఈ పూట చెప్పాలి అనుకున్నా చెప్పేందుకు భాష రాక మౌనంగా నిలుచున్న నా గుండెలో ఆ మాటలే ఇష్క్ ఇష్క అని ద్వనించినా నీకు వినిపించగా ఓ రాగంకై నా గొంతు వేచి చూసెనే నీ ప్రేమ ఒప్పు సంకేతాలు చలి వెన్నెలలా మది తాకు తిరస్కరించేవా నా గుండెలో పేలు ఆగ్నిలావాలు🔥 నీ మాటలతో మాయ చేయక తొలినాళ్ళ బాస మరిచిపోవక....! నా బ్రతుకు బండి చివరి మజిలీ ఆగిపోవాలి నీ ఒడిలో ఆయువు నిండిన నా కాయం కన్ను మూయాలి నీ కౌగిలిలో నా ఆశ తీరి శ్వాస ఆగి నీ ఊపిరిలో కలవాలి అది పరిపూర్ణమైన బతుకని నా ఆత్మ తరలిపోవాలి నా చివరి నవ్వు నీ చేతులపై వెండి గాజులై మెరవాలి. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సిగ్గేస్తోంది.....!

చిత్రం
  సిగ్గేస్తోంది.....! ప్రియసఖి నిన్ను కలవరించగా నా కలలో నీవు నడయాడంగా నిజమైతే నీ పాదమేగి ఆర్ధించనా నా రాణిగా నా హృదయ సామ్రాజ్యమతిష్టించమని అందమైన నీ రూపాన్ని అప్సర అన్నా తక్కువని భువిపై లేనిది నీ అందం భువనమంత నీ దాసోహం ఆకాశాన్ని అరువుగ తెచ్చి ఎండపొడ సొకక గొడుగుగ మార్చి నక్షత్రాలే కోసుకు తెచ్చి దారిని చూపగ దివిటిగ మార్చి సూర్య చంద్రులను బందించి నీ ఇరు కన్నులలో అరమర్చి సముద్రాలనే మళ్లించి నువు స్నానమాడ కొలను జేసి రెక్కల గుర్రం ఎక్కించి, లోకాలన్నీ చూపించి మన జంటను చూసి మురిసిన సురలు పూల అక్షితలు కురిపించే నీ తోడు ఉన్నంత కాలం చిరంజీవివని దివించే ఒక్క క్షణం దూరం అయిన ఆ దూరం మరణం అనిపించే మృత్యువుకై ఎదురు చూచే అన్నపానీయం అనవసరమని సహించక మనసు నిద్రించే భరింపక కనులు రోదించే కన్నీటికి ఓ ప్రయోజనం అది మనసును చెయును నిర్మలం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఒంటరికి తుంటరి ఆలోచన...!

చిత్రం
ఒంటరికి తుంటరి ఆలోచన...! ఒంటరిగా నే వేచివుంటిని తుంటరినై నిను రమ్మంటిని రాగమందుకు పాట పాడితి నువు కదిలోస్తుంటే పల్లవైతిని నీ పాద స్పర్శకై పూవునైతిని రంభ లాంటి నీ ఒంటి మెరుపుకి కనులతోనే నువు ఆడించు క్రీడకి బానిసనై మోకరిల్లితి, నీ బాహులలో దూరవలెనని బావురుమంటిని నీ జడతోనే జయించేవు నన్ను అది తాచు పాములా బుసలే ఈను నీ నవ్వు చాలు, నీ పలుకే చాలు ఆ వెన్నెలయిన కోయిలైన కళ్ళు చెదిరి నేలవ్రాలు ఉన్నదే నీ పెదవి రంగు సంధ్య వర్ణము తేలిపోవు నీ బుగ్గలే బూరలంట అవి కోరుకుతుంటే మజాలంట నీ హస్తములపై హర్ష రేఖలు రాశులన్ని దాసోహం, నవ గ్రహాలు దాసి ఘణం పాదములా అవి పసిడులా పసుపు పూతతో మెరిసే పారిజాతాలా నీ చిటికన వేలు తోడు చాలు నీ చీర కొంగు జతగా ముడివేయు నీతో వేసే ప్రతి అడుగు వంద జన్మలకు ప్రణాళికలు నా చూపు నీ వైపు, నా బతుకు నీ కొరకు ఉండవా నా చెంత ఒకరికి ఒకరుగా...? రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు