సిగ్గేస్తోంది.....!

 








సిగ్గేస్తోంది.....!

ప్రియసఖి నిన్ను కలవరించగా
నా కలలో నీవు నడయాడంగా
నిజమైతే నీ పాదమేగి
ఆర్ధించనా నా రాణిగా
నా హృదయ సామ్రాజ్యమతిష్టించమని

అందమైన నీ రూపాన్ని
అప్సర అన్నా తక్కువని
భువిపై లేనిది నీ అందం
భువనమంత నీ దాసోహం

ఆకాశాన్ని అరువుగ తెచ్చి
ఎండపొడ సొకక గొడుగుగ మార్చి
నక్షత్రాలే కోసుకు తెచ్చి
దారిని చూపగ దివిటిగ మార్చి
సూర్య చంద్రులను బందించి
నీ ఇరు కన్నులలో అరమర్చి

సముద్రాలనే మళ్లించి
నువు స్నానమాడ కొలను జేసి
రెక్కల గుర్రం ఎక్కించి, లోకాలన్నీ చూపించి
మన జంటను చూసి మురిసిన సురలు
పూల అక్షితలు కురిపించే
నీ తోడు ఉన్నంత కాలం చిరంజీవివని దివించే

ఒక్క క్షణం దూరం అయిన
ఆ దూరం మరణం అనిపించే
మృత్యువుకై ఎదురు చూచే
అన్నపానీయం అనవసరమని
సహించక మనసు నిద్రించే
భరింపక కనులు రోదించే
కన్నీటికి ఓ ప్రయోజనం
అది మనసును చెయును నిర్మలం...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...