ప్రేమ లేఖ...!

 








ప్రేమ లేఖ...!

ఓ మాట నా నోట ఈ పూట చెప్పాలి అనుకున్నా
చెప్పేందుకు భాష రాక మౌనంగా నిలుచున్న
నా గుండెలో ఆ మాటలే ఇష్క్ ఇష్క అని ద్వనించినా

నీకు వినిపించగా ఓ రాగంకై నా గొంతు వేచి చూసెనే
నీ ప్రేమ ఒప్పు సంకేతాలు చలి వెన్నెలలా మది తాకు
తిరస్కరించేవా నా గుండెలో పేలు ఆగ్నిలావాలు🔥

నీ మాటలతో మాయ చేయక
తొలినాళ్ళ బాస మరిచిపోవక....!

నా బ్రతుకు బండి చివరి మజిలీ
ఆగిపోవాలి నీ ఒడిలో
ఆయువు నిండిన నా కాయం
కన్ను మూయాలి నీ కౌగిలిలో

నా ఆశ తీరి శ్వాస ఆగి నీ ఊపిరిలో కలవాలి
అది పరిపూర్ణమైన బతుకని నా ఆత్మ తరలిపోవాలి
నా చివరి నవ్వు నీ చేతులపై వెండి గాజులై మెరవాలి.

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...