ఒంటరికి తుంటరి ఆలోచన...!








ఒంటరికి తుంటరి ఆలోచన...!

ఒంటరిగా నే వేచివుంటిని
తుంటరినై నిను రమ్మంటిని
రాగమందుకు పాట పాడితి
నువు కదిలోస్తుంటే పల్లవైతిని
నీ పాద స్పర్శకై పూవునైతిని

రంభ లాంటి నీ ఒంటి మెరుపుకి
కనులతోనే నువు ఆడించు క్రీడకి
బానిసనై మోకరిల్లితి,
నీ బాహులలో దూరవలెనని బావురుమంటిని

నీ జడతోనే జయించేవు నన్ను
అది తాచు పాములా బుసలే ఈను
నీ నవ్వు చాలు, నీ పలుకే చాలు
ఆ వెన్నెలయిన కోయిలైన కళ్ళు చెదిరి నేలవ్రాలు
ఉన్నదే నీ పెదవి రంగు సంధ్య వర్ణము తేలిపోవు

నీ బుగ్గలే బూరలంట
అవి కోరుకుతుంటే మజాలంట
నీ హస్తములపై హర్ష రేఖలు
రాశులన్ని దాసోహం, నవ గ్రహాలు దాసి ఘణం

పాదములా అవి పసిడులా
పసుపు పూతతో మెరిసే పారిజాతాలా
నీ చిటికన వేలు తోడు చాలు
నీ చీర కొంగు జతగా ముడివేయు
నీతో వేసే ప్రతి అడుగు వంద జన్మలకు ప్రణాళికలు

నా చూపు నీ వైపు, నా బతుకు నీ కొరకు
ఉండవా నా చెంత ఒకరికి ఒకరుగా...?

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...