శ్రామిక వలస భారతం



సందర్భం : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 

శ్రామిక వలస భారతం, 
పుట్టిన చోట పట్టెడన్నం పుట్టని అగాతం
వలస కూలి, కన్నిటి కేళి 
రోజు కూలి, కడుపు ఖాళి

ఇలా అన్నపుడు, మళ్ళి మళ్ళి విన్నపుడు 
మనసు చెదిరి కన్నిళ్ళు నేల జారి 
అమాయకంగా అడిగిన ప్రశ్నలు 
తత్తరపడి జవాబు దొరకని తిప్పలు 

బాద్యులెవరైనా భాద నిన్ను అలిమింది 
కరోనా కక్షకట్టి నీ మెడకు ఉచ్చు బిగించింది 
అన్నపూర్ణ అనె దేశం లో నీ ఆకలి ఏక్కడ తీర్చింది 
నీ ఆకలి గీతం మన పాలెగాళ్ళకు ఏం నేర్పింది 

కాంక్రిటు జంగలిలో బతుకన్నది భారమై 
పరిమితికి మించి పనిగంటలతో ఒళ్ళు శల్యమై 
అన్నమో రామచంద్ర అని అయినవాల్లకు దూరమై 
స్వతంత్ర బారతం లో నీ ఉనికి ప్రశ్నార్దకమై 

కన్నిళ్ళను బిగబట్టి, ఖాళీ పొట్ట చేతపట్టి 
మరణం అనివార్యమని తలచితివా 
అనాధలా కాక అయినవాళ్ళ మద్య 
తనువు చాలించాలని ఆశనొందావా 

గమ్యానికి, నీ సొంత గుమ్మానికి 
కాలి నడకన చేరుకుంటావా 
అలుపెరుగక వందల మైళ్ళు 
గోదారిలా సాగిపోతావా 

ఆకలి అక్రందనలు జీవితానుభవాలుగా వల్లెవేస్తు 
కరోనా నేర్పిన పాటాలు కంటశోశతో ఆలపిస్తూ 
దారి పొడుగున ఆపాత స్మ్రుతులు జారవిడుస్తూ 
ఉండాలనె కోరిక మదిలో కొరుకుతున్నా వెళ్ళి పొతావా.!

కారుతున్న నా కన్నీళ్లు నీ కాళ్ళకు పసరు పూత గా మారి ప్రవరుని వలె ఎగర గొరుతు మీకు నా కవితార్పన ..!

రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...