లాక్డౌన్ లో ముదిరిన ప్రేమ...!



ఎర్ర రంగు వలువతో
ఎగిసి పడుతున్న ముంగురులతో
చిరు గజ్జెల తాళమేస్తు
చిరు మందహస హోయలు పూస్తు

దరి చేరిన ఆమని
తానె నా ప్రియమణి
నీ రూపు నవ్వె, చూపు నవ్వె
తనువు నవ్వె, తపన పొందె

ఆ ఓర చూపు సోయగాలు
కోప్పు మల్లె పరిమళాలు
తన మాటలతో మత్తు చల్లి
నా తనువును ఎత్తుకెల్లి

తెల్లార్లు ఊసులల్లి
స్వర్గాన్ని చుట్ట చుట్టి
అదరాలతో మడత పెట్టి
అందించెను కిల్లీ కట్టి

తడికారెసిన కురులు దూస్తు
జారెసిన పైట ఓరలో ఫలాలెవొ వొలక బొస్తె
చూసిన నా కళ్ళు రెండు రసాలన్ని జుర్రుకొస్తె

అయ్యారె ఈ రేయికి నీ నవ్వె నజరానా
ముందు ఎన్ని జన్మలైన నువ్వె నా తోడు కావా..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...