ఏది దారి బిగుసు కుంటుంది ఉరి..



ఇది కథ కాదు, నా వ్యధ
బుద్ది తోలిచె ప్రశ్నలకు ఏది దారి అను శీర్షిక

ఏది దారి బిగుసుకుంటుంది ఉరి
మానవుడా కాస్త బద్రం మరి
కోమ్ముల పురుగు (కరోనా) నీలొ చెరి
రెండు వారాల్లో నీ పని హరి

కరోనాతొ దేశాలన్ని కబళిస్తున్నాయి
కన్నిళ్ళు యదతన్ని వెక్కిరిస్తున్నాయి
ఎటు చూసినా మానవ కళేబరాలు
అపశకునపు నీడలు, యుగాంతపు జాడలు

సురా ముప్పై మూడు కోట్ల దేవతలున్న దేశం
ఓళ్ళు ఎరుగని శివం ఉంటదా అను తర్కం
మానుతున్న గాయల మీద వేడీ నీళ్ళు చల్లినట్టు
అసలే ఆర్దిక మందగమనం
ములిగె నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇదేదో శాపం

ఆద్యాత్మిక ధుని, విజ్ణాన ఖని అంటూ 
మా దేశం అని బిర్రుగున్నా
కంసాలి పని మొత్తం కంట్లోనె ఉన్నా
 కారు పట్టరాదను శాత్రం
అందరూ మేదావులే కాని అవసరానికి దాటెసుడే
పేరుకు పండితుడె మత్రాలన్ని కంటస్తమె
కాని గొంతు పట్టిందను నాటకమే

ఇక పభుత్వాలు వాటి పథకాలు
పబ్లిసిటి పీకు, పని తనం వీకు
పాకురు బండ మీద పాయసం గిన్నె బోర్లించినట్టు
మంచు ముద్దను ఇచ్చి భద్రం బిడ్డా అన్నట్టు

ఇక ఈ దేశ పౌరులు ముష్టావతారం ఎత్తారు
నాయకులు కోట్లు మింగి రెండు వేలు దర్మం చేస్తె చాలు
కిం అనకుండా కుక్కిన పేనులా పడుంటారు
అభివ్రుద్ది అనగానే ఎక్కడ సార్ ఎంత సార్ 
వాగ్ధానాల్లో కాదు
వాస్తవం లోకి రండి అని సినిమా డైలాగ్ విసురుతారు

ధనం పై పైత్యం తో ధరణిని నాశనం చెసావు
రాజకియాలకు కులం మతం రంగు పులిమి
మనిషికి మనిషికి మద్య వైశమ్యం పెంచావు
తప్పు చెసావు రా మూర్ఖుడా తప్పించుకోలెవు

ఈ దేశం లో మేధావుల కన్నా బాబాలు ఫెమస్
సంపద స్రుష్టించె వాడికన్న 
విభూధి నాకించె వాడు ఫెమస్
ఇక్కడ అందరు నటులే, నాయకులు లేరు
గెలిచిన వాడు కేడీ, ఓడిన వాడు జగత్ కిలాడి

70 ఏళ్ళ భారతం లో
ఉన్న వాడికి లోటు లేదు
పేద వాడికి ఇది కొత్త కాదు
నేటికి నీడ లేదు, రేపటికి భరోసా లేదు..

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...