పారిశుద్య కార్మికుడు(సఫాయి)



సఫాయి, నీవే మా సిపాయి
శుచి శుభ్రతకు కలికితురాయి
గోరువంక చూడగానే గాభరగా గల్లి దాటి
చీపురుతో తనువు కలిపి చీకట్లను పరదా జరిపి

ముక్కుదూల మదిరి పడే మోరి ధూళి తోడి మరి
ఛి కొట్టే చెత్త నెత్తి, పావురంగ కుప్పనూర్చి
కంపుకొట్టే పట్నానికి పాలతోలు కప్పినారు
WMC కి మేమే నిజ సేవకులమని చాటారు

సూర్యుడొచ్చి, నెత్తినెక్కి,అలసిపోయి,వాలిపోయి
అర్దజాము దాటినా ఆగదు నీ ఆరాటం
కంపుపిల్చి రొంపుతున్న తీరదు నీ పోరాటం 
ఇన్నియెళ్ళ జీవితంలో గుర్తించని సాహసం

వంగిన నీ వెన్ను ఎముక, చెరిగిన నీ చేయి రేఖ
నీ పని నిండుగ దుర్గంధం ఆరోగ్యం జర భద్రం
బురదంటిన బట్ట చూసి దూరంగా గెంటినం
కరోనా దాపుకొచ్చి దాటింది నీ కీర్తి ఖండాంతరం..

సఫాయి, నీవే మా సిపాయి
శుచి శుభ్రతకు కలికితురాయి
నా పద కుసుమాలతో అల్లిన ఈ కవిత 
మీ పాదాలకు అలంకరణ కాగలదని నా నమ్మిక..
                         
 రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...