పోలిస్ మీకు మా సెల్యూట్..



పోలీస్, అంటుంటెనే గుండెల్లో ఏదో గుబులు 
కళ్ళళ్ళో చూసి మాట్లాడాలంటె ఓళ్ళంతా బుగులు
దేశ సంరక్షణ భాద్యతలో మీతీరు మొగులు
కరోనా నివారణలో మీ చర్యలు సొభగు సొభగు

పొద్దుగూకులు కోలువు, తేలియని పదం సెలవు
ఆలు బిడ్డలకు దూరం, రోడ్డు మీదనె పతేకం
రాత్రి పగలను లేదు భేధం
చెడును తరుముతూ సాగు నైజం
పోలిసన్నా మీ త్యాగం మరవబోదు మా ప్రజా లోకం

"పూలమ్మిన నేల మీద కట్టెలమ్మె దాపురికం"
తప్పును దండించు చేయి దండాలని కదిలింది
తండ్రి భాద్యతనేత్తుకుని గుమ్మం లో కోలువుంది
యమ భటులను అడ్డగించి ప్రాణాలను నిలిపింది

కన్న తల్లి మరణిస్తె కన్నీళ్ళను దాచినావు
చివరి చూపు నోచుకోని శిలలాగా మారినావు
"కన్న వారి కన్న దేశసేవే మిన్న" 
అను సూక్తి బోదించావు
నీ ఔదార్యం తో మా మనసులన్ని తడిచేసావు

ప్రమాణం చేస్తున్నాం సార్..
మీ భాద్యత పంచుకుంటాం
దేశాన్ని నెగ్గించుకుంటాం
అతి చెష్టలు వదులుకుంటాం
ప్రయాణాలు మానుకుంటాం
భౌతిక దూరం పాటిస్తాం
మీ కష్టానికి సలాంకోట్టి సహకరిస్తాం

ప్రెండ్లీ పోలిస్ మాత్రమె కాదు
మా రక్షణకు"ఓన్లీ పోలిస్" అని గోంతెంత్తి నినదిస్తాం..

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...