దేశం లో రా'నీచ'జకీయం..👈



ఈ దేశ భవితవ్యం 
అంతరిస్తున్న మానవత్వం 
బుద్ది లో దాగుంది అంగవైకల్యం 
కంటతడి పెడుతుంది మా నేటితరం

అదికార ధురాగతం, అభివ్రుద్దికి ఆమడ దూరం 
పెద్దరికం ముసుగులోన ఆధిపత్య పోరాటం 
దోరికినంత దోస్తారు, దోచినంత దాస్తారు 

నిర్మూళన అనగానే సక్క గుద్ది వస్తారు 
ఉద్యమాలు ఏవైన అనుకూలగ మలుచుకునురు 
ఇదే నేటీ పాలన జాతికి పట్టిన కీడురా 
నిద్ర మత్తు వదలరా నిగ్గుతేల్చ కదలరా 

ఎన్నికలని వచ్చేరు ద్రావణములో ముంచేరు 
సోమ్ములెన్నో పంచేరు కాలి ధూళి నంటెరు 
ఓటు కోరకు పరిచార్లు గేలిచారో మరల రారు 
పంచినంత కూడబెట్ట పన్నాగం పన్నేరు 

“Divide and Rule” Britishers ని మించిపోయారు 
అభివ్రుద్దికి మాల వేసి కులం మతం ముందు వేసి 
మంచి తుంచి ముప్పు పెంచి గిరి దాటని భంటు చెసి 
భుజం కాసె జెండా మోసి, భజనేనా బతుకు సి సి 

గురువింద గుంజ తీరు, ఆ ఉసరవేల్లి వీరు 
సంపాదన నీ ద్యేయం, దోచుకోనుటే మీ నైజం..

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...