ఉద్యమ నాయకుడు, ప్రజా సేవకుడు..!



ఈ ఆటవిక లోకంలో దైవత్వం అందత్వం పొందింది
న్యాయదేవత కళ్లుకట్టి, అన్యాయం సృష్టించే అలజడులు
బడుగు పేదల ఆక్రందనలను
బోయిల పాటలు గా విని ఆనందిస్తున్నారు

ధనికుల ఇంటి గుమ్మాలకు, శోభావైబోగాలకు
నా శ్రామికులు శ్రమ దోపిడీకి గురవుతున్నరు
సమానత్వం, స్వేచ్చ, స్వతంత్రం ప్రజల కోసమే
అన్న మాట అవాస్తవం అని రుజువయ్యింది

మనిషిని మనిషే పిశాచాల్లా పీడిస్తున్నరు
అధికారం ఉన్నొడికే అన్ని పూటలా విజయం వరించి
ఆకలి కేకల ఆక్రందనలు చిన్న చూపు చూస్తున్నరు

ఆ అరాచకాలు, దురాగతాలు, ప్రశ్నించే
జాతి పురుషునికై భావితరాలకైన
ఈ దుస్థితిని మాన్పు చేసే ధీశాలికై
నా రాష్ట్రం కంట శోషతో ఎదురు చూస్తున్నది

జీవించడం అంటే సంపాదన కాదని
నలుగురిని నీడన చేర్చాలని రోదిస్తున్నది
నిస్వార్థ రాజకీయ ప్రతిష్టాపనకై ఓ శక్తి కదిలి రావాలి
రాజకీయకులకు చెంపపెట్టులా సిద్ధాంతాలు రచించాలి

అలాంటి నాయకునికై నా జాతి నిరీక్షణ ఫలిస్తూ
తన సన్నిధిలోనే రాష్ట్రప్రజలకు విమోచనమనిపిస్తూ
2000 సంవత్సరం శుభశకునం అనిపిస్తూ
తెలంగాణ రాష్ట్ర సమితి మార్గమని భావిస్తూ

అరవయ్యేళ్ళ చింత తీర్చే అసాధరణ శక్తివై
ప్రో జయ శంకర్ సార్ ఆశయాల రూపనివై
సబ్బండ వర్ణాల ఒక్కటి చేసి, చావు నోట్లో తలపెట్టి
"కేసీయార్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో" అన్నావు
తీరని కోర్కె తీర్చి తెలంగాణ జాతిపిత అయ్యావు

కోటి ఎకరాకు నిరందించి అపర భగరథుడవయ్యావు
"తెలంగాణ కోటి రతనాల వీణ" మాట నిజం చేశావు
స్ఫూర్తి ప్రదాత వందనం ఉద్యమ సూర్యుడా వందనం

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లొడు 
జై తెలంగాణా ! జై జై KCR !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...