కరోనా నేర్పిన పాఠం(ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా)



ఏరా మనిషి 
చెప్తే విన్నావు కాదురా 
క్రమశిక్షణ తప్పిన క్షమ కూడా లేదురా

ఎదిరా నీ దర్పం, ఎక్కడరా నా నీ ధనం
ఎంతరా నీ గర్వం, వచ్చింది రా నీ అంతం
రెండు పూటల కాలాన్ని మూడు షిఫ్ట్ లుగ మార్చావు
కాలచక్రాన్ని ఎదిరించి కాళ్ళకు చక్రాలు కట్టుకు తిరిగావు

" ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా "

"ఆఖరికి ఆరడుగుల జాగ" అను తర్కం 
మరిచి అకాశహర్యాలు నిర్మించావు
ఉన్న నేలను నాశనం చేసి మరో గ్రహం వెతికేవు
పంచ భూతాలను జయించిన నీ గంభీర స్వరం 
కంటికి కనిపించని జీవి ముందు బెరుమన్నావు

" ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా "

ఏమయ్యాయి నీ విలాసాలు
ఎవరు చెప్తే వింటావు నీ లోపాలు
ధనం కాదు బంధుత్వం శాశ్వతం కాదంటావా...?
నేను అను మాట మరిచి నలుగురితో నడుస్తావా..!

" ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా "

ఇంకా మించిపోలేదు ఇకనైనా కళ్ళు తేరువు
లోభిగా లాభపడలేవు, స్వార్థం తో. సాదించలేవు
ప్రకృతితో విబెదించకు, ప్రగల్బం తో ప్రాణాలు బలిపెట్టకు
మతం పేరుతో మానవత్వం నులి పెట్టకు

"ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా"

తల్లిదండ్రులను గాలికొదిలితివి
భార్యాబిడ్డల గొసవెడితివి
గవ్వలు ఎన్ని పోగేసినా
గంజి నీళ్ళే అన్న ధ్యాస మరిచితివి

"ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా"

పేరుకు గొప్ప కానీ ఊరు దిబ్బ అని
ప్రపంచం గెలిచే జ్ఞానం ఉన్నా
కరోనా కంటపడే దైర్యం చేయక
గుమ్మం లోపల నక్కి దాగుంటివి 

"ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా"

భౌతికమైన వాంఛ తోడ ప్రమాదం అంచు తొలిచి
స్వదేశీ జ్ఞానాన్ని విదేశాల అమ్మకం పరిచి
జెట్ లోన తిరుగు వారు డోలి లోన మోసే మాపై
కరోనా కూత విని స్వదేశం వచ్చావు కరోనా ఇచ్చావు

"ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా"

రెక్కాడితే డోక్కాడే జీతాల జీవితం లాక్డౌన్ చేర్చావు
అన్నానికి అంగలార్చే కన్నీటిని మిగిల్చావు
ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా 
క్రమశిక్షణ తప్పిన నీకు క్షమ కూడా లేదురా..

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...