చైత్రకు ఆశ్రు నివాళిగా (ఆడది అబల కాదు సబల)










నాటకీయ నాగరికతలో 
ఆడది ఆటవస్తువుగా పరిణమించింది
సబల అని కీర్తించిన చోటే 
అబలగా అనామకురాలు గా
నీతి గతి మాలిన
అమర్యాద అందలమెక్కినా
మిన్నక ఊరకుండి పోయింది

వట్టి పోయిన సిద్ధాంతాలు
చిల్లులు పోయి పెల్లులా రాలే
సాంప్రదాయానికి ప్రతికగా మార్పు గడించింది 

స్త్రీని దేవతగా కొలిచిన నాడె ధీనంగా
దిగంబరాన్ని చేశారు ఓనాడు (ద్రౌపది)

అనుమాన భూతాలు హుంకరించి 
అగ్నిలో తోశారు ఆనాడె (సీతమ్మ) 

అనాదిగా ఆడ బ్రతుకు అడవి వెన్నెల 
అది ఏ సౌఖ్యమూ నోచుకోని కాటి దివిటిరా 

మగాని పాశనహ్రుదయానికి నాటి 
ఆయేషా,స్వప్నిక, స్వాతి, రఫియ ప్రతీకలు 

ప్రేమోన్మాదానికి కీచక పాలనలో 
స్త్రీకి రక్షణ కరువని నేటి "ప్రియంకా రెడ్డి,మానస, దిశ, చైత్ర"
నిస్సహయ మరణ నేత్రాలు 

అవి పాలక వర్గాన్ని నిలదిసే జాతి జాగ్రుత విధాతలు 
ఇది తలరాత కాదు అయ్యో ! అని బోరుమన 
ఇది కర్మ ఫలము కాదు కారు చీకటిలో క్రుంగిపోవ 

నిస్తేజమైన నిద్రలో జోగుతున్న అధికారుల
కుంచిత స్వభావాలకు స్వస్తి పలుకగా 

కోటి గొంతుకలు ఒక్కటై, కీచకుల కంఠమైన
బుసలు ఈను కోరలనైన పీకి పాతరేయగా 
పిలుస్తుంది భరతమాత సంకెళ్లను తెంపగా 
అబల కాదు "సబల" అని నిరూపించగా
అబల కాదు "సబల" అని గొంతెత్తి వినిపించగా🗡

                         రచన : తాజ్ 
                     మీ పల్లెటూరి పిల్లొడు
--------------------------------------------🪄
గ్రామం : దామరంచపల్లి
మండలం : రేగొండ్
జిల్లా : జయ శంకర్ భూపాలపల్లి
సెల్ : 9581114146

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...