పడతి తిరేదెలా నీ వెలతి(గృహిణి)













పడతి తిరేదెలా నీ వెలతి(గృహిణి)


వంటింటి సంస్థానములో మహిళలే మహరాణులు 
విరామమె ఎరుగకుండ చిరునవ్వులు పూయాలి 
ఇరుకు ఇరుకు గదుల మద్య వేల మైళ్ళు నడవాలి 
కోత్త కోత్త రుచులు వండి జివ్యాపెక్ష తీర్చాలి 
వంటిల్లె ప్రపంచమని బ్రతుకంతా తరించాలి 

నిదుర విడిచి వేళ మరిచి సుఖం మరిచి మోఖం వాచి 
తోలి జామున నిద్ర లేచి పేడ నీళ్ళె అత్తరుగ తలచి 
ముక్కు ధూళమదిరేటి బోళ్ళనెల్ల భూడిదతో శుద్ది చేసి 
పిల్లజెల్ల ఇల్లుపెద్ద ఓక్కటిగాభావిస్తూదినమెల్లా సేవిస్తూ 
సోంత కలను మరుస్తుంది కుటుంబమై నిలుస్తుంది 

కోంగు నడుముకు చుట్టి చీపురు చేతిలో పట్టి 
ఊపిరి సత్తువ జేసి నెత్తురు చెమటగ మలిచి 
గుర్తించని లోకం పై అలుపెరుగని పోరాటం 
అమ్మైనా ఆలి అయినా నిరంతరం తరం తరం 
మారలేదు ఏ క్షణం వంటిల్లే చివరి గమ్యం 

కాలిన గాయలతో తిరగదోడె నోప్పులతో 
ఓళ్ళు గుల్లవుతున్నా, డోల్ల మనసుతో 
నిర్వీరామంగా శ్రమిచె శ్రామికురాలు పడతి 
వంటింటి కర్మాగారం లోనే తనకు సంత్రుప్తి 
ప్రాణం ఉన్నంత కాలం తనకు లేదెమో విముక్తి

కసురుకునే పరివారాన్ని కోసిరి కొసిరి వడ్డించి 
బాగుందని ఒక్కరన్న ఎంత పొంగిపోదువో 
ఏమి నా భాగ్యమని మురిసి మురిసి నవ్వెవో 
తెల్లార్లు నిద్రమాని రేపు వంటెమని ఆలొచన చెసోవో 

పడతి నికేదో వెలితి 
ఎపుడమ్మా నీ పనికి పరిమితి 
ప్రశ్నించడం మరిచితివా ఈ జగతి
వంట్టింట్లో మగ్గడమేనా నీ అభ్యున్నతి

అతివలెవ్వరికి
ఏ రోజు నీది కాదు తల్లి ఇక సండే మే డే కూడానా అయ్యో.!
అందుకే కుటుంబ భాద్యత మోసె 
ప్రతి మహిళకు "క్షేమాపణల" శుభాకాంక్షలు...

 రచన : తాజ్
పల్లెటూరి పిల్లొడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...