వెన్నెల సావిడిలో వన్నెలాడి కొంగు జారి..



ఈ చల్లగాలి వీణ పాటల లో 
ఈ పిల్ల తోడు చిలిపి ఆటలలో 
వరుణుడికి రాకకు ముందు వేళలో 
ఉరుముల మెరుపుల అల్లరి చలిలో 
బెదరక చంద్రుని పారె యెలుగులో 

రాతిరి రేపె కోరిక మదిలో 
ఇరువురి తనువుల తుంటరి పనిలో 
మల్లియలల్లిన కోళ్ళ మంచములో 
కిర కిర మంటు చేయు గానములో 

ఇక ఆ వెన్నెల వెలుగులో నా దేవి 
అది వెలిగె చంద్రుని కిరణమని 
పందిరి పై ఈ మల్లియలె 
తననల్లుకు వదలకు వెళ్ళమనె ..!

ఆకాశంలో తారకలు తన నుదుటన చేరగ తపియించె 
పూసిన బంగరు తామరలు కోప్పున నిలవగ కదిలొచ్చె 
పసిడికి మించిన అందమని అవి నేలకు జారి విలపించె 
లేత పరువాల తీపి స్పర్శకై తన చెతిలొ పడితెచాలంటూ 
ఈ ఏర్ర రోజాలు వినిపించె ఇవ్వరా అని నిదించే 

నా గుండెను గుడిగా బావించి నిను దేవతగా ప్రతిష్టించి 
ప్రెమ ముద్దుల నైవెద్యములతొ నిత్యాభిషెకాలు ఇస్తున్నా 
గుండెలయలె జే గంటలుగా ఆర్దిస్తూ ఓక వరమడిగా 
నా మీద నీ ప్రెమ ఎప్పటికి నిలవాలని 
నా ఆయుష్సు నీ శ్వాసలో కలుపుకొవాలని 
పసి పాపలా నను నీ ఓడిలో దాచాలని 
చివరి చూపులొ నీ రూపు నా తోడు రావాలని 
అర్ధిస్తున్నా...! అభ్యర్ధిస్తున్నా..!!

                                            రచన : తాజ్ 
                                          పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...