చేజారిన బాల్యం ఒక వరం ఒక అద్భుతం..



చిన్న నాటి బాల్యం చితి చేరువన వస్తుందా 
చిరు జ్ణాపకాల దోంతరలొ మనసు తేలికవుతుందా 
వచ్చిపోవు చంద్రునిలా నా బాల్యం తిరిగొచ్చేనా..?
అమ్మ చేతి చల్ల బువ్వ ఆరగించాలని వున్నది 
నాన్న గుండెలపై జారి నవ్వాలని వున్నది 
తేనెలూరు బాల్యం ఇంక్కొక్కసారి రావాలని వున్నది 

పిల్లగాలి వెన్నెల్లో పాలపిట్టలా కోమ్మల్లో 
ఆడి పాడిన బాల్యం అమ్మ చేతిలొ తాయిలం 
అందనని వెళ్ళింది అలిగినా రానంటుంది 
కోతి కొమ్మలలో చెడుగుడు నీటి మునకలలో 
తేలి ఆడిన బాల్యం ఆశ వదులుట నెయ్యం 

మట్టి కుండల ఆట తప్పు దోర్లె మాట 
బోసి నవ్వుల కూత చిన్ని మువ్వల మోత 
మరపు రానన్నది మది తోలుచుచున్నది 
జాతరోస్తే బూర పండగోస్తె గారె 
కోత్త బట్టలు కట్టి ఊరు మొత్తం చుట్టి 
హరిదాసుల గానము గోంతు తీపి పాశము 
అల్లరల్లరిగ రోజు ఇల్లు పందిరి చేయు 

చిన్న నాటి రోజులన్ని చిగురాకు కోమ్మాయె 
ముదిరి పెరిగిందంటె ముఖము వాచిపాయె 
రెక్కలోచ్చిన పక్షి గూడు వదిలినట్లు 
పొట్ట చేత పట్టి ఊరొదిలి నేనోస్తె 
పొద్దు మాపు బతుకు గానుగెద్దైపాయె 
సావిడిలొ ఆల మంద అరుపులు శ్రుతి తప్పి 
నౌఖరుగా నా చుట్టు కాకుల గోలైపాయె 

బడికి పోమ్మని నాడు బ్రతిమిలాడిన నాన్న 
చదువుకున్నా బ్రతుకు సాకిరేవు అని చెప్పలె 
గాడిదొలె గట్టు లాగాలని చెప్పలె 
ఒళ్ళు బల్లగ పరిచి గుండె తలగడ చేసి 
కడుపు కాల్చినా నిద్రకోర్చినా 

బానిసోలె చెస్తె బాడుగే మిగిలింది 
ఎప్పటి బ్రతుకె ఎనుగుల చిప్పే 
సంకల జొలే పై ఊరుకు పరుగే 
అమ్మా నిన్నొక్కసారి చూడాలని ఉన్నది 
నీ పోత్తిల్లలో దూరి ఈ జన్మ ముగించనా?అనిపిస్తుంది 

రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...