నయన చంద్రిక..!



ప్రియా..!మదిలోన భావాల లయ 
ప్రియా.. !నయనాల చంద్రుల నిలయ 
మోమంతా విరగ కాసిన సన్న జాజుల చాయ 
నడు వోంపున పరుగులెత్తు పల్లె వాగు పాయ 

అధరములొ మధురిమలు రుధిరములొ సరిగమలు 
గాజులతొ గల గలలు మువ్వలతో నీ సైగలు 
ఎందరైన నీ ముందు అయ్యో ఇక దిగదుడుపె 
నంగి చూసిన కుర్ర కారు సొంగ కార్చి నదులు పారె 
అందుకేగా సముద్రాన ఉప్పు నీరు నిక్కమాయె 

అయ్యారే..! ఈ రేయికి నీ నవ్వే నజరాన 
నీ నోటరాలు ముత్యాలె ముద్దులతొ ఎత్తుకోన 
హత్తుకుని మత్తుకమ్మి, మల్లెపక్క వోత్తుకుని 
పట్టె మంచం మొత్తుకుని...

ఆ కిర కిరమను గమకం లో 
నీ చిరుబురల తమకం లో 
నా సోంతమయి నిలువుమా,సంతసం లో మునగమా 
మన సంసారం సాగగా, సంతానం పెరుగదా....

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...