అన్నధాత సుఖిభవ దిగ్విజయిభవ..!



ఇది నా అంతరాలలోని మాట
అనాలొచితమైనది కాక సమాలోచన కావాలి ఇక 
ఆకాశానికి మేఘం సోంతం 
తన ఫలం మాత్రం ధరణికి ప్రాప్తం 
అది హినమా లేక త్యాగమా 

పంచభూతాలు ఎకమైననాడు 
ధరణి పై అవి యుద్దానికి పూనిన రోజు 
దాని త్యాగమే తోడు కాదా 
ఏ ప్రళయమైన ఎదురోడ్డి మిగలదా 

అట్లే అన్నధాత! అంటే తెలుసొ లేదొ 'రైతు'
అఖండ భారతావనిని అన్నపూర్ణగా మలిచిన ఘనత 
విపత్తులెన్నొ తట్టుకుని దేశానికి ఆకలితీర్చె విధాత 
శ్రమనునమ్మిన హలికుడు విరామమెరుగని శ్రామికుడు 

తోలకరి చినుకులు రాకను మరిచి 
నెర్రలు బారిన నేలను చూసి 
శిరసు దించుకుని కళ్లు ఒత్తుకుని 
మదిలొ ఎదొ శంకించావొ నదిలా లొలొ శొకించావు 

వరుణుడు కరుణించి వర్షించగా 
పెట్టుబడికి ఎది దిక్కు ఆలి పుస్తెకె మోక్షం తుదకు 
ఆరుగాలం మడిలొ తడిచి పంటచేను ప్రెమగ తడిమి 
పిల్లగాలులె గాలిమరలుగా పిల్లకాలువే ఇల్లు లోగిలుగ 
ఎదుగుతున్నపంటను చూసికన్నబిడ్డలా తమకంనోంది 
ఆకలిధూపల ద్యాసెది బెంగపోదువు రెపును తలచి

దేశానికి రైతు వెన్నెముక తన నోటిలొ లేదు నాలుక 
రాబడికి రాబందులైన దళారులపై 
మూర్ఖపు అధికారుల దర్పం పై అతని కినుక 
ఏ దైవం తీర్చునో ఈ ధాత్రి పుత్రుని అలక 

"రైతే రాజు అన్నది నానుడి"
మరి నీ చేతిలో లెదు కదా ఏలుబడి 
ధరల నిర్ణయింపలేని శాశనం నీది 
కిం అనక వచ్చిన ధరకు అమ్మడమే నీ విధి 

నాటి వైభోగమె నేడు కీడు గోడలని 
కాసిన చెట్టుకె రాళ్ళ దెబ్బలని 
పాలకులు మారినా ఫలితం శూన్యం 
శ్వెతవిప్లవానికి పూరించు శంఖం

అయినా రైతే రాజు..
మాడు పగిలె ఎండలో అన్వెషణ 
హలం అనె ఆయుధంతో 
ఆకలి భూత సంహరంకై జన్మించిన దైవాంశ ...!

ఇలాంటి ధినస్థితి వల్లే రైతు నుండి రైతు కూలీలుగా మారిన నా తల్లదండ్రులను స్మరిస్తూ... 

రచన : తాజ్
మీ పల్లెటూరి పిల్లొడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...