బుజ్జి కోటరు..



సందర్భం : లాక్ డౌన్ తో మందుబాబుల అవస్థలు

ఏమాని చెప్పనమ్మో నువు లేక పాణమే నులువడమ్మో
నెలరోజులాయెనమ్మో ఈ యడబాటు ఓర్వనమ్మో 
నాలుకే లాగెనమ్మో తలలోని నాళాలు పగిలెనమ్మో 
మద్యపానం లేదని నాలోన పానాలు పాయేనమ్మో
ఏ జన్మ పాపమమ్మో నిన్నిడిచి ఉండగోరు శాపమమ్మో 

ఇల్లాలి పొరువున్నా నిన్నొదిలి గడియైన ఉండనైతి 
గడియారం ముల్లువోలె గుండెల్లో నీ మీదే నాకు భీతి 
ఇన్నాళ్ళ నా జీవితం అయ్యో నువ్వేగ నా ఇంధనం 
కన్నీళ్లు మింగుతున్న అయ్యో కాలి కీసకు మొక్కుతున్నా 

పండగోస్తె నువ్వే పంచాయితికి నువ్వే
చావు పుట్టుకల్లో దోస్తానివి నువ్వే
దుమ్ము కొట్టిన బతుకు బగవంతుడవు నువ్వే
దినం అలిసిన చీకటిపొద్దుకు వైద్యుడవు నువ్వే

ఇల్లు డోల్లవుతున్న ఓళ్ళు గుల్లవుతున్న 
పూట పూటకు నిన్ను ప్రేమగా ముద్దాడి 
వందయేళ్ళ బతుకు ముప్పైయెళ్ళకే మాడి 
కళ్యాణ భాదకంటే హాయిగా కాట్నం లో కాలుతుంటే 

ఎన్నికల యాల్ల నాడు అమ్మా నివేగ నోటి తీట 
మా కులము లీడరోడు ఆడబ్బ మార్చిండు నేడు మాట
కరోన వచ్చెనంటూ నీన్నాపి మాడ్చిండు పూట పూట 
దండాలే 'కే సి యారు'నువ్వైనా ఎత్తు మందు గేటు 
  
అన్నమూ నీళ్ళకన్నా ఓ మందు అన్నిటా నీవే ముందు 
మందు లేని తంతు లేదు జగమునందు
ఉన్న నాలుగునాల్లు తాగి తూగుతుండు

రాసింది : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...