మంచికి రోజులు లేవ్వు మామ....



జీవితం లొ ఒక రోజు చితి పెర్చక తప్పదు 
హృదయాశ్రులు నేల జార్చి రొదించక తప్పదు 
ఉదయించిన సూర్యునికి ఆస్తమయం తప్పదు 
జనియించిన మనిషికి శివైక్యము తప్పదు...

నేడు నిజం రేపు భయం 
పొద్దు పదం మాపు మాయం 
అంతా మనదె కొంతకు కొదువె 
అందరు నీ వారె ఎంతకూ పగవారె...

గమ్మమెక్కడ మజిలి మట్టి లో 
ఆశ బారడే బతుకు బుడిదె 
కొరిక కొరివె నిను కాల్చు కాష్టమె...

రుదిరమ్మున రొకలు మోది 
హృదయాశ్రుల కుండలు పగిలి 
రొదించినా ఓదర్పులొ ఏ మార్పులె
ఆ తిర్పులొ కవ్వింపులె......

సమాజమె వ్యసనం 
దాన్ని అనునయించాలని శాసనం 
నీ లొగడ హెచ్చకు ఇతరులు మెలెంచకు 
బనాయించి ధనం పెంచు
డబ్బు నీదైతె దైవం నీ పొత్తు 
దారి చూపించి తానె జై కొట్టు 

బడాయి పొతు కాలరు పైకెత్తు 
చచ్చాక స్వర్గమో నరకమో 
చూసిందెవరు తిరిగొంచిందెవరు...

బుద్దిని నమ్ము మనసును అమ్ము 
మంచికి చెడుకి అంగులమే తేడా 
మంచి కి పొతె మంగలం పాట
చెడును నమ్మినొడు చెడలె బెటా
అవకాశం ఏదైనా అదిమి పట్టు
ఏ అదికారైన నీకె జై కొట్టు..!
__________________________
 రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...