వనజాక్షి..



తొలకరి రాలిన వసంత వేళ
పచ్చ చీర కట్టిన ప్రక్రుతిలా 
చేతికోచ్చిన పంట మాగాణిలా 
పూతై కాతకోచ్చిన వనాలమ్మలా 

ప్రక్రుతి పుత్రిక పరువాల కోమ్మ 
చూసిన కన్నుల ఆకలి మరల..!
అరుణ కీరణాల అల్లిన చీర 
తన ఓంటికి అద్దెను సొభగుల మేళా 

అకాశపు వర్ణాలన్ని గొరింటై నీ కాలికి అద్ది 
గల్లుమనగ నీ మువ్వల రాగం 
గుండె అదలదా, పండగే కదా 
నిను చూడ కన్నులే చాలవే ఎలా!!

ప్రక్రుతి నీకు సరితూగు మాలతి..
నా వనజాక్షి ముఖస్తుతి....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...