అమ్మాడి పోదామా ఊహల జగతిన పరిగెడి..!



కురుస్తున్న ఆ వానజల్లు
పులకరిస్తున్న ఈ నేల ఒళ్ళు
పరిమళించే మట్టి వాసనతో మళ్లు
పచ్చరంగు తివాచీ పరిచి
ఆవ్హానిస్తున్న ప్రకృతి నికివే నా జోహార్లు

ప్రకృతికే పరువం నేర్పిన ప్రేయసి
ఇస్తున్నా నీకిదే నా కలాక్షర హారతి

రవి దాగి ఊరేగ వచ్చిన నిశి జాబిల్లి నీ నవ్వు
కలువోలే ఎదురు చూసిన రోజుల్లో
సప్తవర్ణ శోబిత నీ కనుల దోబుచుల్లో
వరదగుల్లు జరిగిన వర్షం
నీ నవ్వు జారిన నా జత చప్పట్ల హర్షం

తేనెలూరు నీ భాష్యం ఓ మధుకలశం
మురిసిన చీకటిలో నీ మువ్వల సవ్వడి విని
మన్మధుడు ఒళ్ళు నిండి నీ ముందు చేరి మోకరిల్లి
కనుతెరువని తిమిరంలో నీ తనువు తాకి మోర్చిల్లి
గుండె వెగమెక్కిపొగ గొంతులారి గోసరిల్లు

అదిరింది భామ చలి
మొదలు ఇక శృంగార విభావరి
కాలం కదిలిన కాసేపటికి...

చెదిరిన కురులు, నలిగిన మల్లెలు
కొరికావిరై పారే చేమటలై
అమ్మాడి.... 
పోదామా ఊహల జగతిన పరిగెడి..!
                    
                                        రచన : తాజ్
                                    మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...