ఆయమ్మా నీకు వందనం (Baby care centers)




ఆలు మగల ఉద్యోగం
పిల్లల బ్రతుకున అంధకారం

పొత్తిళ్ళలో పసికూన ఆకలి అరుపులు విని
పరిగెత్తుకోస్తున్న పాల సీసాలు గని
సగం కడుపుతో కూన సర్దుకుని
అందానికై తల్లి ఆరాటమెంటని
అడగలేక మూగ కనులతో కసిమి
గొడ్డు గొద కున్న ప్రీతి మడిసికి లేదని
తల్లడిల్లే బిడ్డ ఆకలి తాళలెలని

చనుబాలు ఎరుగని పిల్లలెందరో
తల్లి ఒడి చేరని బ్రతుకులెన్నో
ఎంత ఏడ్చినా గుక్క పట్టినా 
ఊయాలే తనకు ఓదార్పు అని
అమ్మ ఒడి నాకు హులక్కే అని

తీరిక దొరకని నాన్న చేతిని
అందకోవాలనే చిలిపి ఆశని
తోపుడు బండి తీర్చేసింది
కాలికి ఉతం అందించింది

అమ్మ ఒడిలో నిదుర పోలేదు
నాన్న చేతిలో నడక నేర్వలేదు
అందరు ఉన్నా అనాధ నేను
చలనం కలిగిన కీలు బొమ్మను🕴

అమ్మ ప్రేమా..? ఎమో తెలీదు
నాన్న ఎవరంటే కరి బండ తోచేను ( నల్లని రాయి)

సరిగ్గా అప్పుడు..?..!

ఆయామ్మే అసలు తల్లిలా
అన్ని నేర్పిన మొదటి గురువులా
లాలించింది పాలించింది
సహృదయం తో దివించింది

దేవుడు పంపిన మరో అమ్మలా
నాలో మనిషికి ప్రాణం పోసి
సమాజానికి మంచి పౌరున్ని అందించింది 👨‍💼

ఆయామ్మా నీకు వందనం
నీ ప్రేమ పొందిన నా జన్మ ధన్యం..🙏
----------------------------------+++++🪄
రచన : తాజ్
పల్లెటూరీ పిల్లోడు...✍️

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...