మనుషుల తీరే ఇంత..! (నమో హైద్రాబాద్)













మారిన జీవన ప్రమాణం 
బంధాలు అనుబంధాలకు దూరమై  
శాంతి సంతృప్తి లేక  
మనుషుల్లా కాక మర యంత్రాలుగా మారిన మనం 
మారేది ఏనాటికో చేరేది ఏ గూటికో 

గతుకుల దారిలో గమ్యం ఏమిటో ....?

అందనిదే గొప్పంటారు  
ఆత్రంగా పరిగెడతారు 
అయోమయమై అంతా భ్రమయై 
అస్తవ్యస్తపు అలజడి బ్రతుకై  

భాగ్యనగర భోగాలల్లో భోగ లాలస క్రీడలు కొరివై  
సంపాదన సహేతుకమైన సిరిని గిరిగా పోగేయాలని 
సహనానికి సవాలు చేస్తూ పైసాపై సవారీ చేస్తూ
కోరికలను కుంపటి పోసి వేడి ధగల సంతృప్తిని కాచి   

అశాంతిలో అడుగులు వెసి నూతిలోని రొట్టెను కూడా 
నేతి అని చేతులు తోసి అభద్రతను ఆలింగనం చేసి 
ఉరుకులు.. పరుగులు..నిరాశల చూపులు  

రేపటితో నేటిని మరిచి  
మూకుటిలో పేలాలవుతూ  
ఆ తెలుపే శాశ్వతమనుచూ 
సంబరంతో గెంతును అంటే  

మంట తాప తూలిక తనది  
జాలి అంటే అమాయకం మనది  
రంగుకారమే ఒంటికి పూసి 
జోడు బాధలే మనసుని దోసి  

నిరంతరం తరం తరం  
పరంపరల తదనంతరం  
జీవితమే బొంగరం 
కోరికలకు ఆశలకు అనువైన మందిరం  
మనశాంతిని దోచే యంత్రాంగం..!

రచన : తాజ్ 
పట్నం చేరిన పొరడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...