ఓటు బ్యాంకు రాజకీయము...



సందర్భం : ఎన్నికలు ముగిసిన అనంతరం

నీతి మాలిన రాజకీయము 
నియమము లెనిదీ నీచకీయము 
బలిసిన నేతలు భడా చోరులు 
ప్రజా పిడితకు ముఖ్య కారకులు 

జనావాహిని వారి వాహనములు 
కార్యకర్తలని నామకరణములు 
ప్రజల నాడిగోని పరుగులిడుదురు 
పైసా పంచి ప్రతినిదులవుదురు 

ఓటు బ్యాంకు ఈ రాజకీయము 
ఓట్లు రాలిననే చాటు ముఖములు 
కంస కీచక రాక్షస గర్వం,దోపిడి పర్వం 
తెలుగు నేలలో వేళ్ళునిన భూతం 

ఏంతకాలమీ ఆకలి చావులు 
ఏన్ని నాళ్ళు ఈ అత్తెసరు బతుకులు 
సాగకూడదీ నీచ దురంతర 
నిగ్గు తెల్చాలి రండి పోరాటంగా 

మేల్కోండి ఓ ధాత్రి పుత్రులు 
తరిమి తరిమి కోట్టుడీ దగుల్భా•••?

 రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...