లక్షి దేవి ( నీ జడన జెగంటను నేను )



పసుపు వస్త్రమున పసిడి కాంతగా 
చెవుల లోలాకు చిందె వెలుగునా 
మెడన ఆడు ఆ హారమంచునా 
రంగు రాళ్ళను పోదిగినందున 

లక్ష్మీ దేవిలా కాచె కన్నుల 
సిరులు ఓలికెరా మణులు కురిసెరా 
నీ నడుము నాట్యాన నా చేయి సాయగా 
చుట్టు చుట్టనా వడ్డాన మవ్వనా 

గంధం విరజిల్లు ఆ కురుల అంచున 
జేడ గంటనై సేదతిరనా 
సర్పమంటి ఆ నాసికంచున 
తీపి పలుకునై నే నిలవన 

శంఖమంటి నీ చెవుల నిత్యము 
నా ప్రెమ బాసలు వల్లెవేయన 
నీ అదర చుంబనల తో అలసిపోనా 
నీ అందాల విందామరలు చూసి చూసి మూర్చపోనా

నీకు దూరం అయిన 
మన యదల భందం విడిపోయిన
ఈ లోకాన్ని విడిచి పోనా జీవితాన్ని నిలువరించనా 
ఆకాశ మార్గాన కదిలిపోనా 

అల్లంత దూరాన ఓ తారలా 
నీను చూస్తూ నే నే మిగిలిపోనా 
ఆ జాబిలి వేలుగు నీవె కాదా 
నీ దాపున నేనే ఓదిగిపోనా 

నీవు అలిగిన నాడు చీకటి కాదా 
అందుకైనా నువ్వు నవ్వాల
నీ నవ్వున నే కూడా వెలగాలా..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...