దేవేంద్రునితో యుద్దం...!



పడుచుదనం పరుగు తీయగ పల్లకినై నే నీ ధరి చేరగ 
నీ పరువం మోస్తూ నేను, మై మరచి గానమెత్తగా 
నీ కన్నుల వెలుగె నాకు దారి చూపు దీపము కాగా 
నా ఊపిరి లయలో మ్రోగుతు నీ కాలి గజ్జే తాళమెయగా 

నీ కంటి రెప్ప సవ్వడి వింటూ వడి వడి గా పరుగెడగా 
దారి పోడుగు దాసి కన్నెలు చెమంతుల బంతులెయగా 
అపహరించు దేవకన్యయని దేవేంద్రుడు యుద్దం చేయగ 
నిలువరించి మెడలను తుంచి తరమనా నీను గెలవగా 
సంబ్రమాశ్చర్యం తో భూ నభుంతరాలు దీవేనలిడగా 

పాల బుగ్గ లోలికె సిగ్గు బుగ్గపైన ఎర్రని ముగ్గు 
పెదవిపైన పూసిన పువ్వు మదువు జారు నీ చిరునవ్వు 
పసిడి మెరుపు కసిరెపె రూపు మాటు వేసి వేస్తా కాటు 
నీకు నాకె ఇక పోటి నీవు లేని జీవితం ఏపాటి 
పూట పూటకు నీ తోటి సందర్శిస్తా స్వర్గ నగరి 
జన్మ చివరన వాలిపోదాం ఆ వారణాసి (కాశి)
-------------------------------------------------++++++🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...