సగటు భారతీయుని గా నా ఆవేదన..!



స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడలో
అది స్వార్థపరులు చేతిలో కీలుబొమ్మ అని చిన్నబోవాలో
ఇన్నాళ్ళ స్వాతంత్య్రం ఏమిచ్చింది
పేదరికపు దరిద్రం, అవినీతి లంచగొండితనం
స్వార్ధపు నల్లదనం అధర్మం అన్యాయం పాశవికం

వెరసి..?
గాంధీజీ కలలుగన్న స్వాతంత్య్రం అగ్లేయుల
పాలనేనా అనిపిస్తుంది కదూ
ఇది నాలాంటి సగటు భారతీయుని ఆవేదన
అరవై నిండినా అర్డాకలి వీడలేదు
రాజ్యమేలే అన్యాయం సర్దుమనగలేదు
ఓనమాలు నేర్పి ప్రజల చైతన్య పరచలేదు

ఒరడిస్తూ బుజ్జగిస్తూ మెలకువగా
వున్నా కూడా ఒంటి బట్ట లాగేరు
ఇన్ని చూసి కార్చే కన్నీటిని కూడా
అవమానం చేస్తూనే అవహేళన గా చూస్తూనే
ఆకతాయి పథకాలతో ఆశలెల్ల నింపెరు
నోటి కాడి బుక్కలాగి బూటు కాలితో తన్నెరు

ఎన్నికలలని ఉన్నన్నాల్లు సామాన్యుడు మనిషిరా
అధికారం వున్నన్నాల్లు ఎవడు కానరాడురా

ఏది ఏమైనా..
సమాధానం కోసం ఎదురు చూపులే
అనుభవజ్ఞులందరు మిథ్యావాదులే..!
.............................................🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...