నెల జీతగాడు(private employee)



జీవితమను సముద్రయానం 
జీతం అను తెరచాపతొ గమనం
అమ్మకాల తెడ్డు లెకనె 
నడ్డి విరిగేటి గడ్డుకాలం 

సంపాదన సహెతుకం కాదా 
సహనం వీడి పరుగె ఎలా..?
జీతానికి భలి జీవితం కాదా 
అన్నిటికి ధనమె ప్రధమం 
కష్టేఫలి పలుకె నిగమం 
నీ కష్టం ఎవనికి ఫలితం..?

"రాత్రులు నీవి కావు, పగలు నీకు నీవే లేవు"

నియమం లేని సమయం కాని 
పరిమితి లేని పని గంటలు 
పడిగాపులు ఉన్నా కుంటి బ్రతుకులు 
అత్తెసరు అధికారులు 
సత్తె సావండను దొభి మాటలు..

పేరు గొప్ప ఊరు దిబ్బ అను సామెత ఉంది 
గడీయ ఖాళి లేదు,గవ్వ నిలువ లేని గాదే మనది 
గంగ కనుల సుడి తిరుగు గాధ చివరిది 

అందరూ దూరమయ్యారు ?
కాలం శాపం, ఇక ఇంతె ప్రాప్తం!

కాలప్రవాహం లో కరిగి పొయాను కాని ?
ఉదయ భానుడను కాలెకపొయాను!
ఆశల పల్లకిలొ అహార్నిశలు శ్రమించినా
అందలం చేరుకోలేక పొయాను

గతం లో గతించానె కాని ?
గర్వించేలా ఎదగలెక పొయాను!
ఇది జీవిత పాటం అనుభవాల పీటం 
అందరికి ఆశే చిరకాలం మాకు గొసె....

ఏ కార్మిక చట్టాలు మా కష్టాలను తప్పించలేవు
ఒక్క పూట సెలవు కోసం ఎన్ని సార్లు అధికారుల కాళ్ళు మొక్కమో లెక్కేలేదు 
మేడే రాగానే నిప్పులో ఉప్పూలా రగిలిపోతాం
తెల్లారగానే నిమురుకప్పుకుని పనిలో చేరిపోతాం 
జీతం ఐతే వొస్తుంది కాని జీవితమే రోజు రాత్రి గుండెను తొలుస్తుంది

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...