నీవే కదా నా ప్రశాంత జీవనం..



ఇదేమి జీవితం, కానీ ఇదే జీవితం
అన్నివున్నా లేమి జీవితం
మనసు కన్నీట జారు జీవితం
ఓర్పు లేక ఏ తీర్పు నోప్పక
కడుపు కాల్చినా నిద్రకోర్చినా
మర్మం తెలియని వనితంట
లోతే ఎరుగని మా జంట

తప్పు ఏమైంది చిక్కు రగిలింది
హక్కు యాడుంది చివాక్కు మిగిలింది
అర్దం మారి పెడర్థం దూరి
నమ్మకం కరిగి అపనమ్మకం పెరిగి
పరం తూలనాడి మిగిలిందేది..?నీది/నాది

ఉరిమే నింగి విరిగితే ఏమీ
తిరిగే భూమి కంపనలేమి
ఒక్క నిమిషం ఆలోచిస్తే
ఉలికిపాటులో అంతా మాయం
అతలం వితలం అంతా శూన్యం

అట్లే..
అలిగినా నీవే నను అల్లినా నీవే
నీ కోపం ఉప్పెన నాకు, నీ ప్రేమ చంద్రుని తాకు
నీ చేతుల అలరారని రోజు, నా రేపటి బ్రతుకే చేటు

నీవే కదా నా జీవితం
నీ తోడుంటేనే ప్రశాంతమైన జీవితం
ఇప్పటికీ ఎప్పటికీ నీ తోడే నా జీవనం
నీ నవ్వే నందనవనం..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...