భగ్న ప్రేమికుడు( దేవదాసు)



రాళ్లపై తన పేరు రాయలేదెన్నడు
రాతి గుండె తనదని తెలియరాలేదెన్నడు
నా కంట శోకాన్ని రాల్చలేదెన్నడు
ఆ శిలను కరిగించే రోజు రానెన్నడు

ఆ మనసు కే ఇంత అలుసైతినినాడు
నా మనసులో తనని నలిపితే ఏనాడూ
అవమాన బారముతో అలసితిని ఈనాడు
అక్కరకు ఆడించి వంచించే ప్రతినాడు

ఆడదే నా పాలు హాలహాలమాయేనే చూడు
నా బ్రతుకు మారింది పస లేని బీడు
చివరగా చెదిరింది ఆశల గూడు
ఆఖరకు నా బ్రతుకు ఎనలేని మోడు

చూడరా బాబు ఆడదో క్రీడ కై నీడ
అనుసరిస్తుంది అభినయిస్తుంది
వెలుతురు లోనే తోడోస్తుంది
అందులోనే అంతరిస్తుంది

చీకటి చేరిన పారిపోతుంది
ఒంటరి చేసి బాధిస్తుంది..👤
------------------------++++++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...