అమరులకు వందనం..



వందనాలు వందనాలు అమరులార మీకు
ఉద్యమాన పోరారు జీవితాన వెలిగారు
జన్మకు అర్దం నేర్పారు అలా జీవించండని చెప్పారు

బానిస బ్రతుకులు వద్దని
బలిదానం ఇక శరణ్యమని 
ప్రాణ త్యాగమే మార్గం అని
అదే తెలంగాణకు సన్మార్గమని
మా హృదయ స్పందనగా మారి
ఉద్యమ స్పూర్తితో నడవమని

అమర తెలంగాణ నాది వీర తెలంగాణా
అసువులు బాసిన అమరుల ఆకృతి నా తెలంగాణ
అడుగడుగున పెనుగులాట
ఒడిదుడుకుల తెలంగాణ

ఉద్యమంగ కదిలినం
వీరోచితంగా పోరినం
రండి రండి రండి 
అడుగు కలిపి నడవండి
బంగారు తెలంగాణకు బాసటగా నిలవండి..

జై తెలంగాణ.. జై జై తెలంగాణ...

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...