శీర్షిక : గణేషునికి వీడుకోలు...🐘(ఊగుతూ ఊరేగింపు)



గణతమాటున దూర్తులు

గాడి తప్పిన భక్తులు

పానకంలో మునుగుతూ

పూనకంతో ఊగుతూ


భక్తి గిట్టక, రక్తి హెచ్చగా

దొర్లిన అపశృతులు

భజన కీర్తనల ఊసెలేదు

భరితెగించిన చేష్టలు చూడు


చందాకొచ్చి చిందేస్తారు

వందకు వంద అని ఎత్తేసారు

ముందుగానే మందుకు వాటేస్తారు

పెగ్గు పెగ్గుతో ఊగేస్తారు

నిస్సిగ్గుగా నవ్వేసారు


డప్పుల కూత, బాంబుల మోత

భాహ భాహి సవాలు విసురుత

ప్రధమ పూజనియునికి తప్పని పాట్లు

ప్రతీ అడుగులోనూ సారా ప్యాకెట్లు


ప్రసాదతీర్థం అంతా వ్యర్దం

ప్రవాహమగును బ్రాందీ వర్షం

తప్పు ఒప్పులను లౌకికమేది

నాగరికతలో దౌర్భాగ్యం ఇది...!


రచన : తాజ్

పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...