శ్రీ సీతారాముల కళ్యాణం...!













శ్రీ సీతారాముల కళ్యాణం
చూసిన కన్నుల పరమానందం 
విన్న మా చెవుల శ్రవణానందం
దశరథ తనయ జనకుని పుత్రి 
ఒక్కటి చేసే శుభగడియ
మన జన్మకు దొరికిన పుణ్యమయ

అంతఃపురమైన, అరణ్య మైన
వైబోగ మైన, వైకుంఠ మైన 
కలిసి నడవమని, ఒదిగి గెలవమని 
నేర్పిన ఘనత, ధాత్రిన చరిత 

తండ్రి మాటతో అడవి చేరినా
ఆలి దూరమై పోగిలి ఏడ్చినా 
ధర్మం తప్పని నడక 
మనిషే కానీ..! దేవుడైన నడత 

కాలం ఏదైనా వారిని అనుసరించడం మన ధర్మం 
తనువెల్ల పులకించగ తిలకించడం 
మన జన్మ జన్మల పుణ్యం.....!

రచన : తాజ్
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...