బడి బడుగు పేదల గుడి...!



అంశం : మూతపడుతున్న సర్కారీ స్కూళ్ళు

తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న మీ ఆలోచనలకు అభివాదం కానీ..........
అది పెట్టుబడిగా మారిపోయింది
నర్సరీ చదువుకి లక్షా..అది తిరిగి సంపాదించడమే లక్ష్యమా....?

తృప్తి లేని జీవితం, సంతృప్తి ఇవ్వని జీతం 
వెరసి పోరుగు దేశాలకు పారిపోతున్నారు
కోట్లు సంపాదించినా తీరని కోర్కెలతో
మీకు కొరివి పెట్టే భాధ్యత కూడా విస్మరిస్తున్నారు

విద్య వినయేన శోభతే: అని కాక 
విద్య ధనార్జన విత్తం అయిపోయింది
మీ డాబు కోసం చదివించి వాళ్ళతో డబ్బు కోసం పరుగులు పెట్టించకండి

శీర్షిక : బడి బడుగు పేదల గుడి

బలహీనులకు బంధం తానై, 
భవిష్యత్ తరాలకు బాటలు వేసి
అక్షరమనే భీజం వేసి, 
సామాన్యుడికి జ్ఞానం పోసి
లాంతరు వేసుకు నడిచొచ్చింది, 
బడితో బంధం పెనవేసింది
ప్రాంతీయాభివృద్ధి ధ్యేయం అంది, 
ప్రతి పేదొడు ఇక చదవాలంది

ఆశయాలతో అడుగులేసినది,
అసమానంగా ఆదరించినది
అమూల్యమైన ఆస్తి పంచినది,
అంతలోనే వంతు మార్చినది
తంతుగ భారతి చింతలు తీర్చే, 
తాడో పేడో నిగ్గును తేల్చే,
భావి నాయకుల అంకుర దీపం
కాటి అంచున చేరెను శల్యం

అభివృద్ధికి అది కొరగాకుంది, 
నిశీధి అలిమి నినదించింది
నిరాశ కమ్మి విలపించింది, 
అధికారులతో మొరపించింది
అలసిపోయి ఇక సెలవంటుంది...

రాయల కాలం లో 
రత్నాలు రాశులు గా అమ్మారు
ఈ రాయల్ కాలంలో చదువును దయనీయంగా అమ్ముతున్నారు
చదువుల తల్లిగా కొలువుతీరిన సరస్వతిని సంతలో అమ్మే దాష్టికానికి ఒడిగట్టారు
బడుగు పేదల గుడి గా విరాజిల్లిన *బడి*
కొనుగోలు అమ్మకాల కోలాహల ప్రాంగణమయింది

దయనీయ స్థితిలో 
ధాత్రిపుత్రులను వేడుకుంటుంది భారత మాత
అంధ అధికారుల అరాచకాన్ని ఆపలేక
చదువుల తల్లిని కాదు,నీ తల్లిని అమ్ముకోమని చెప్పరాక
గుండె గొంతును నొక్కిపట్టి,
న్యాయదేవత కళ్లుగట్టి
సరస్వతిని సంతకిడ్చి, 
అమ్ముతున్నారు వేలం పెట్టీ
ఒక అమ్మ పాలు తాగి మరో అమ్మ రొమ్ము కోసి
నాగరికత మాటుసాగే నాటకీయపు చదువులన్నీ 
ధనం ఉంటే దొరుకుతుంది
నిస్పృహ నిస్సహాయత నడుమ దౌర్భాగ్యం మనకు మిగిలింది
ఆఖరకు చదువుకు డబ్బు నిర్వచనమైంది
-------------------+++++++🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా
చారవాణి : 9581114146

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...