శృంగారభావ సుకుమార సుందరి..!













ప్రియా... ప్రియా...
అని పిలవనా నా ప్రాణం నీవని చెప్పనా
రవ్వల నీ చీరకట్టు
శ్రావ్యమైన నీ చేతి పట్టు
శ్రవణానికి నీ మాట తేనెపట్టు
సౌమ్యమైన నీ ఆటపట్టు
శృంగారానికి నీవే ఆయువు పట్టు

శాసిస్తూ భాషిస్తావు, కోపిస్తూ మెప్పిస్తావు
అలక పూనిన ఉల్క నీవు
జాలి కలిగి నాపై రాళిపోదువీవు
నింగిని వీడి నేలకు జారి
భంగిమ తొడిగి భామగా మారి...

కాకతీయుల కళా పంటవట
నళినీ, నాగిని నీ చెలులంట
పరువమనే మాటకు పీఠిక నీవు
పరులేవ్వరికి దక్కని పాఠ్యాంశం నీవు

నీలో ప్రతీ అక్షరం అమూల్యమే 
నీలో ప్రతి అంగుళం అమోఘమే
గ్రంధములగు నీ అందం ముందు
గారాలు పోతూ గ్రహిస్తా విందు..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...