సుఖదుఃఖాలు

 








ఆశు కవిత్వం..

పాపం పుణ్యం దేవునికేరుక

మంచి చెడు మడిసికే ఎరుక

జననం నిజం మరణం నిజం

నడుమన బ్రతుకే నాటకం అన్నారు అన్నమయ్య


నాటకం కూడా యాతనే అయితే

నరకం కూడా నెయ్యమే అంటాను నేను


పరమాణువులన్ని ప్రాణిగా మారి

తోలుతిత్తిలో వాయువు పోసి

రాగం రోగపు నవదారులు కలిగి


భాగ్యం బోగ్యం బాధ సుఖం

కామం క్రోధం కరుణారసం

అన్ని సమపాళ్లుగా రక్తి కడగిననే

జీవితం అను నాటకం జనరంజకం

లేదన్న కానరు లే జనం..

-----------------------------------++++++🪄

రచన : తాజ్ 

పల్లెటూరీ పిల్లోడు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...