యువత ఎక్కడయ్యా భవిత..













యువత...
కానరాక భవిత, భవిష్యత్తు మూత 
కలిసి రాని గీత, అందని ఏ చేయూత
పల్లె వదిలి పట్నం చేరినా, పట్టా పుచ్చుకు పచార్లు తిరిగినా
నౌకరీ ఇచ్చే నాదుడు లేడు, కిందా మీదా బాదుడు షురూ..!

పనికి రాని ప్రణాళికలు, ప్రచారానికే పథకాలు
దారి చూపదు చదువు, దరిద్రానికే ఇది మొదలు
అధికారుల ఆట, జారుతున్న కన్నీట
ప్రభుత్వానికి సుస్తీ, పనులన్నిటా జాస్తి🖕

అందుకే గా ఆ పెద్దల సూక్తి
చదువుకున్న ఈ సన్నాసి కన్నా
చదువు లేని ఆ చాకరి మిన్న..
----------------------------------------++🪄
రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...