జంట పక్షుల కమ్మటి గానం....













తూరుపు తెల వారింది, వెన్నెల దిగి నడిచింది
సూర్యుని పొడ సొకగనే, ముంగిట ముగ్గయ్యింది
కోడి కోయిలయ్యింది, కూత పెట్టి అరిచింది
నిను లేప సహసించింది.. అప్పుడు.......!

చెదిరిన ఆ కురులను చూసి, జారిన ఆ వలువలకేసి
చూసిన నా కన్నుల ఫలికి, ఈ రోజుకు శుభమని పలికి
నీ నవ్వుల శ్వేతంకెనా, నా తనువు న శీతం రాసి
చలి చలిగా నిను పెనవేసి, గిలి గింతల గేయం నీకై
రమ్యంగా రాస్తా యదపై...........

మన జంటను చూస్తే ఇలపై, ఎ పోటీ రాదే ఇకపై
నది దాటని నీరుమల్లే, గతి మారని తారవోలే
నీలోనే ఉంటాను,నీ నీడగ మారతాను
ఇంద్రధనసు రంగులోని భావాలు
నీలోను పలికిస్తా, నీ గెలుపుకు కృషి చేస్తా...
------------------------------------------+++
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...