చిలిపి నవ్వుల చినదాన...













ముసి ముసి నగియుల మువ్వలదాన
ముంగురు కురుల మూగదాన
శ్వేతప్రస్పుటాలంకార ముద్దుగుమ్మ 
నటన కన్నుల మాత్రికురాల

మగతత్వ మెరిగిన మాయల బొమ్మ
మత్తును జల్లే మరల బొమ్మ
గారడి నేర్చిన వయ్యారివమ్మ

నీ జడ కొప్పున నను తురిమితివమ్మ
ఊపిరి సలుపక చస్తున్నానే కొమ్మ
వదులు విడువవే ఆశల దిమ్మ
అర్థాంతరంగా చస్తానే
నీ జడ కుచ్చుల నడుమ...
-------------------------------++++
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...