మహిళలు మీకు మా క్షేమాపనలు














కన్యాశుల్కపు కటకటాలను
బాల్యవివాహపు బంధిభూతాలను
సతీ సహగమన సంకెళ్లను
విదిలించుకుని నిలిచిన

వారి ఆలోచనలను గెంటేస్తూ
వారి కోరికలను చిదిమేస్తూ
కట్టుబాట్ల కంచెలేసి, మూఢత్వం మనసు తొలిచి
ఆడది ఆడదే అని ఇంకా అదిమి పెడుతున్నాం
ఆశలన్నీ చిదిమేసి గడప చాటు తోసేసాం

ఏ ప్రాంతమూ గుర్తించని ప్రతిభలకు
మహిళా సాధికారత పేరిట
ప్రపంచదినం ఎందుకీ మహిళలకు..?

అధికారుల ఆగడాలు, పురుషగణ పోకడలు
పాలనా ఘన మూర్ఖులు, పనికిరాని చేష్టలు
దారి నిలువు ధూర్తులు, దారికాసి చేరుపులు
అడుగడుగునా ఆర్తులు, ప్రాణపీడ నేత్రులు

వేకిలి, నకిలి చట్టాలు, విటులు అయిన యువకులు
శాస్త్రాలు, గ్రంధాలు, చట్టాలు వాళ్ళకి చట్టాలు
అదుపు లేదు ఆజ్ఞ లేదు పాపమనే ఊసులేదు
వివస్త్రగా మారి వనిత, అవహేళన పూని భవిత

అనాధిగా ఆచారం, ఆడ బ్రతుకు గ్రహచారం
అడవిలోని పూలమల్లే, అనాకారి బ్రతుకు సూడే
మారి ఈ పరిస్థితిలో ఎందుకీ మహిళా దినం
మార్పుకు కావాలా మరో యుగం...
......................................++++.🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...