రైతు బతుకు కడు దుర్లభము...











నిత్య కృషివలుడు
సత్య భాషా పరుడు
అతనొక యోధుడు 
ఆకలి పోరులో చస్తూ బతికే వీరుడు

గొరుకొయ్య పొడవగానే
కోడి గూట కూయగానే
జోదెడ్డుల సావాసం
బురద మదిలో తన ఎవుసం 

అన్నదాత, నిత్యాన్న ప్రదాత
ఆకలిని అంతం చేయాలనే ఆర్దత
తాను అన్యాయమవుతున్నా 
అఖండ భారతావనిని 
అన్నపూర్ణగా నిలిపిన దైవాత్ముడా
జోతలివే నీకు మా అప్తుడా

తరాలు మారినా..?
"రైతే రాజు" మరి రైతు'త'రాజు ఎక్కడ
దలారుల చేతిలోనే తక్కెడ
గిట్టు బాటు దక్కని తిప్పలు
మిల్లర్ల దోపిడీకి మిగిలేవి అప్పులు

అంతమై పోతున్న కులవృత్తులు
ఆ దారిలోనే మా రైతులు, రాతలు
నాడు నేడు ఎప్పుడు లేదు వైబొగం
పారె యేరు కనుల నింపి
ఎవరిని నిందించని మంచితనం
అందుకే అతనొక యోధుడు
ఆకలి పోరులో చచ్చి బ్రతికే వీరుడు
-------------------------------+++++++🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...