విశ్వకర్మ సృజిత నారి (నీ ప్రేమ జాడల్లో)








నా ఆరో ప్రాణానివో
నా అంతరంగిక సౌదానివో
నా ఆనందామృత దారవో
సుందర మందార పరిమళ నారివో

స్వర్ణ కామాంచిత స్వర వీణవో
కరుణించి ధారగా రాల్చిన వర్షానివో
చీకటి న దాగి వెలుగు చిమ్మిన దీపానివో
మసక చీకట్ల ను పారద్రోలి నా జీవితాన
కాంతి నింపిన సూర్యదేవుని ప్రతినిధివో

వెన్నెల వెలుగుల జాబిలమ్మవో
నాకై ఇలవెలసిన దేవతవో
నీకై పరితపించు నా హృదయంపై నర్తించు నర్తకివో
నా ఇంటికి కంటికి కమనీయ కాంతి చిత్రానివో

నీ ప్రేమ జాడల్లో, మన పెళ్ళి చూపుల నాటి రోజుల్లో
ఈ నా కవితకు నీ ప్రతిమ ప్రేరణ
ఆ ప్రెరణే నీ అందానికి ఆవిష్కరణ
మన అనుభంద భాందవ్యమే
ప్రేమ దినోత్సవానికి నాంది అని నా భావన..!
----------------------------------------------++++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...